తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ది చెందడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమం పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రతి గ్రామా పంచాయతికి హరితహారం మొక్కల పెంపకం, పారిశుద్ద నిర్వహనాకు ఒక ట్రాక్టర్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
మూడు నెలలకు ఒకసారి 30 రోజుల ప్రణళిక పై అధికారులతో సమీక్ష జరుగుతుంది. ప్రతి గ్రామానికి శ్మశాన వాటిక, డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామాలలో పని చేయని సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, అధికారులపై వేటు వేస్తామని హెచ్చరించారు. గ్రామా పంచాయతీ కార్మికులకు 8500/- వేతనలు పెంచిన ఘనత సీఎం కెసిఆర్ కె దక్కింది. గ్రామాలలో పని చేయని అధికారులను, ప్రజా ప్రతి నిధులను తీసివేసే బాధ్యత కలెక్టర్లదే అన్నారు.