మరి కొన్ని గంటల్లో తెలంగాణలో కాళేశ్వరం పండుగ మొదలుకానుంది.రేపు సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా వ్యప్తంగా కూడా అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్‌ను టూరిజం హబ్‌గా మారుస్తాం. వేయి స్తంభాల గుడి విస్తీర్ణకు భూ సేకరణ జరుగుతుంది. వరంగల్ కీర్తిని నలువైపులా చాటుతమని ఆయన అన్నారు. విలీన గ్రామాల అభివృద్ధి కృషికి చేస్తామన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మహారాష్ట్రలో అక్రమ ప్రాజెక్టులు నిర్మించారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం మీద విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. కాళేశ్వరం మీద అనేక కేసులు పెట్టారు. 4వేల కార్మికులు రాత్రింబవళ్లు పని చేశారు. వచ్చే 3 నెలల్లో చెరువులను నీళ్లతో నింపుతామని మంత్రి అన్నారు. రేపు తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామన పండుగ చేసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టును అందించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.