జనగామ జిల్లాలో వరి ధాన్యం,పత్తి కొనుగోల్లపై జిల్లా స్థాయి అవగాహన సదస్సులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు జనగామ జిల్లా కరువు ప్రాంతం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక కేసిఆర్ దయవల్ల జిల్లాలో చెరువులు నిండి పంటలు బాగా పండుతున్నాయి.ఈ ఎడాది ఎప్పుడూ రానంత ధాన్యం మార్కెట్‌కు వస్తుంది అన్నారు.
ధాన్యం కొనుగోల్ల కోసం జిల్లాలో అవసరమైన చోట్ల అదనంగా ఐకేపి సెంటర్లను ఏర్పాటు చేయండి. ధాన్యం కొనుగోల్లలో మంచిగా పని చేసిన ఐకేపి సెంటర్లకు బహుమతులు అందజేస్తాం. జనగామ జిల్లాలో 15 సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. సిసిఐ ద్వారానే ఎక్కువ కొనుగోళ్ళు జరపాలి అని మంత్రి చూసించారు.
తేమశాతం 8 శాతం ఉండేటట్లు చూసుకోండి. తేమ శాతంపై రైతు సమన్వయ కమిటి గ్రామాలలో రైతులకు అవగాహన కల్పించాలి. తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. ధాన్యం కొనుగోళ్ళు దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా చేపడుతున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.