మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శం- ఎర్రబెల్లి

222
Minister Errabelli Dayakar
- Advertisement -

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని టిఆర్ స్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు టిఆర్‌స్ పార్టీ జెండాఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్ తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి. టిఆరెస్ పార్టీ వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది. మిషన్ కాకతీయ పథకంతో చెరువులు నింపిన మహాత్ముడు సీఎం కెసిఆర్.మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత సీఎం కెసిఆర్ కె దక్కింది. మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శం అని మంత్రి తెలిపారు.

రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీది. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అయ్యింది. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలో అభివృద్ధి శూన్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు నిధులు రాలేదు.ప్రస్తుతం సీఎం కెసిఆర్ చర్యల వల్ల తెలంగాణాలో కరోనా వైరస్ నియంత్రణలోనే ఉంది. రాష్ట్రంలో కరోనా కట్టడికి సీఎం కెసిఆర్ ఎంతో కష్టపడుతున్నారు అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

- Advertisement -