కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని…ఆరునెలల్లో టెక్స్ టైల్ పార్క్ పనులు ప్రారంభిస్తాం లేదంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి… గిరిజన యూనివర్సిటీ కోసం భూమిని కేటాయించాము… కానీ కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయడం లేదని చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం నిరంతర పోరాటం చేస్తామన్నారు.
సియం కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని, కేసిఆర్ గారి నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. చారిత్రక చరిత్ర కలిగిన వరంగల్ నగరం గత ఆంద్రా పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిపోయిందని, సియం కేసిఆర్ అండతో పూర్వవైభవం తీసుకోస్తూ.. అభివృద్ది చేసుకుంటున్నామని అందుకు ప్రజలంతా కారు గుర్తుకు ఓట్లేసి టిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని అన్నారు.
బిజేపి పార్టీ జూటా పార్టీ.. అబద్దాల పార్టీ, మోసకారి పార్టీ కాంగ్రేస్ పార్టీలు రెండు ఒక్కటేనని.. టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు రెండు పార్టీలు రంగులు మార్చుకొని వస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజేపి పార్టీ ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేర్చిందో చెప్పాలన్నారు.