శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బిసి సంఘాల ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిసి సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ.. మహనీయుల జయంతి వర్ధంతిలు ఉతగా జరుగవు వాళ్లను ఆదర్శంగా తీసుకోవడం వల్ల జరుగుతాయి. మహనీయులకు గుర్తుగా వారి విగ్రహాలను పెట్టుకోవాలి. టాంక్ బండ్‌పై దొడ్డి కొమరయ్య విగ్రహం కోసం సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతాను అని మంత్రి తెలిపారు.
అనాదిగా ఉన్న పేదల భూములకు పట్టాలు ఇస్తాం..కొంత మంది పట్టలు చేసి ఇచ్చారు. కొంతమంది ఇవ్వలేదు. భూముల వీలువలు పెరిగిన నుండి అన్నదమ్ములు చముపుకుంటున్నరు. మనకు అవసరమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంబేడ్కర్ అందరికి ఓటు హక్కును కలిపించాడు. ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ప్రాణం. దొడ్డి కొమురయ్య సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నాగార్జనసాగర్‌లో టిఆర్ఎస్ పార్టీ నోముల నర్సింలు కొడుకుకి టికెట్ ఇచ్చింది. నోముల నరసింహులు పేదల కోసం పోరాట చేసిన గొప్ప వ్యక్తి అన్నారు.
ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. ఇలాంటి మహా వీరుల జయంతి, వర్ధంతి వేడుకలు గొప్పగా జరుపుకోవాలి. అన్ని కులాల గురించి పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కొమరయ్య.సీఎం కేసిఆర్ అన్ని కులాలను ప్రోత్సహిస్తున్నారు. గొల్ల కురుమల లక్షల గొరెలను పంపిణీ చేసిన ఘనత సీఎం కేసిఆర్ కే దక్కుతుందన్నారు. శాసనసభ్యుడు నోముల నర్సింలు చనిపోయిన తర్వాత సీఎం కేసీఆర్ అతని కొడుకు భగత్‌కు టికెట్ ఇవ్వడం గొప్ప విషయం.బీసీ సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.