సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిది- మంత్రి

145
Srinivas Goud
- Advertisement -

రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‌నగర్ జిల్లాలో లబ్ధిదారులకు సోమవారం సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లబ్ధిదారులకు 22 లక్షల 46 వేల, 500 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్, జెడ్పీ సీఈవో యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, టీఆర్‌ఎస్‌ నాయకులు అమర్, కౌన్సిలర్లు రామలక్ష్మణ్, మునీర్, చిన్నా, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిది.. ప్రజల ఆరోగ్యం కోసం కార్పొరేట్ దవాఖానల్లో ఆధునిక వైద్యం అందిస్తున్నామన్నారు. ముందస్తు హాస్పిటల్స్ ఖర్చుల కోసం లక్షల రూపాయల LOC లను అందించామని పేర్కొన్నారు.

- Advertisement -