మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్దవంగర, జనగామ జిల్లా కొడకండ్ల, దేవరుప్పుల మండల కేంద్రాల్లో ముస్లీంలకు పండుగ రోజు వస్తువులతో కూడిన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లీం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. అల్లా, దేవుడు, ఏసు పేర్లేవైనా దేవుడొక్కడే.అందరి దేవుళ్ళకు మొక్కుతూ నేను వరసగా గెలుస్తున్నాను అని అన్నారు.
ముస్లీంలను శత్రువులుగా చూడొద్దు. మన సంస్కృతి గొప్ప సంస్కృతి గంగా జమునా తహజీబ్. ముస్లీంల వల్లే కరోనా విస్తృతి అయిందనడం పూర్తిగా నిజం కాదు. ఒకరిద్దు చేసిన తప్పుని అందరికీ రుద్దొద్దు.మరో ఒకటి రెండేళ్ళు మనం కరోనాతో కలిసి జీవించాల్సిందే. టీకాలు వచ్చినా సరే, ఈ పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. కానుక జాగ్రత్తలు పాటించాలి. జ్వరం, జలుబు వంటి విపరీత లక్షణాలుంటే.. వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.
కాగా కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చిన విషయం తెలిసిందే ఈ ప్యాకేజీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బీజేపీది బొంద మీది ప్యాకేజీ అని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రాన్ని కుదవ పెడితే అప్పులిస్తరట. కరోనా కష్టకాలంలో ఆదుకోవాల్సింది పోయి.. అక్కరకు రాని ప్యాకేజీలు ప్రకటించారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు దిక్కులేదు. రైతుల పంటలకు కనీస మద్దతు ధర వచ్చే పరిస్థితి లేదు. సీఎం కెసిఆర్ తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు.
రైతుల కళ్లాల ప్లాట్ ఫారాలకు ఈజీఎస్ నిధులు..ప్రభుత్వం చెప్పిన విధంగా సాగు చేద్దాం.షుగర్ ఫ్రీ తెలంగాణ సోనానే సాగు చేద్దాం. మక్కలు ఈ కారుకు అసలు వేయవద్దు. దేశంలో తెలంగాణ పత్తికి మంచి డిమాండ్ ఉంది. మహబూబాబాద్ మిర్చీ, పల్లీకి కూడా డిమాండ్ ఎంతో ఉంది. అందుకే డిమాండ్ ఉన్న పంటలనే వేద్దాం…రైతుల జీవితాలను బంగారుమయం చేద్దాం. ఇక తోచిన విధంగా ఈ కరోనా కష్ట కాలంలో ముస్లీంలను ఆదుకోవాలని భావించాను. అందుకే కనీసం పండుగ ఒక్క రోజుకి అవసరమైన వస్తువులతో సరుకులను అందచేస్తున్నాను అని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.