గురువారం మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కరోనా వైరస్ నివారణ చర్యలపై అవగాహన సదస్సులో రాష్ట్ర కార్మిక,ఉపాధి,శిక్షణ,కార్మాగారముల,నైపుణ్య అభివృద్ధి శాఖల మంత్రి మల్లా రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు, జె సి విద్యాసాగర్, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, పోలీస్ అధికారులు, కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాల్లారెడ్డి మాట్లాడుతూ.. “కోవిడ్-19 కరోనా వైరస్”_ ని నివారించడానికి శ్రమిస్తున్న పోలీసులకు, వైద్య బృందానికి , మరియు మునిసిపల్ సిబ్బంది కి పారిశుద్ద కార్మికులకు ప్రజలు పూర్తిగా సహకరించాలన్నారు.
కూరగాయలు, పాలు, కిరాణం షాపులలో ధరలు పెంచకుండా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. కరోనా వైరస్ నివారణకు కిరాణా షాపుల దగ్గర ప్రజలు గుంపులు గుంపులుగా సామాన్లు కొనకుండా ఒక్క వ్యక్తి మరో వ్యక్తి కి కనీసం మీటర్ డిస్టెంట్ ఉండే విధంగా మార్కింగ్ చేయాలి, షాపుల వద్ద షానిటీజర్ ఉండే విధంగా పలు సూచనలు చేయడం జరిగింది. అత్యవసరమైతేనే తప్ప బయటకు రాకూడదు అని ప్రజలకు అవగాహన కల్పించాలి అని మంత్రి తెలిపారు.
రోజు సాయంత్రం 7గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు 144 సెక్షన్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ బయటికి రాకుండా చూడాలి అని అధికారులకు నాయకులకు సూచించడం జరిగింది. జిల్లాలో ఎక్కడా కూడా నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించడం జరిగింది. వైరస్ తగ్గుముఖం పట్టేంతవరకు దయచేసి ఎవరూ బయటకు రాకండి. “కరోనా మహమ్మారిని తరిమికొడదాం.. అన్నారు.