సొంత ప్రభుత్వంపై విమర్శలు చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. గురుకుల హాస్టల్‌లలో సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యం పెడుతున్నారని అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లా చింతకుంట బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు అడ్లూరి లక్ష్మణ్. గురుకులాల్లో దొడ్డు బియ్యంతో భోజనాలు పెడుతున్నారు.. దొడ్డు బియ్యం పంపించవద్దని కలెక్టర్లు, సివిల్ సప్లైస్ కమిషనర్‌తో మాట్లాడాను… గురుకుల భూములను ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తున్నారు.. కబ్జాలకు గురికాకుండా కలెక్టర్, రెవెన్యూ అధికారులు చూడాలి అన్నారు.
గత 15 రోజులుగా దొడ్డు బియ్యంతో బోజనాలు పెడుతున్నారని మంత్రికి తెలిపారు ప్రిన్సిపాల్, విద్యార్థులు. పాఠశాలకు దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్న డీఎస్వోపై చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై కమిషనర్‌కి మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
Also Read:కోమటిరెడ్డి-ఉత్తమ్..ఇద్దరూ అసమర్ధులే!

