పొన్నం క్షమాపణ చెప్పాల్సిందే!

20
- Advertisement -

తనపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డెడ్‌లైన్ విధించారు. రేపటి వరకు సమయమిస్తున్నా.. పొన్నం క్షమాపణలు చెప్పాలి అన్నారు.

పొన్నం మాట మారిస్తే తర్వాత జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి… నేను మాదిగ జాతిలో పుట్టి మంత్రి అవ్వడమే తప్పా? చెప్పాలన్నారు. దీనిపై ఇప్పటికే మీనాక్షికి లేఖ రాశాను… త్వరలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేను కలుస్తాను అని లక్ష్మణ్ తెలిపారు.

మా జాతిని మొత్తాన్ని పొన్నం అవమాన పరిచాడు… ఆయన లాగా అహంకారంగా మాట్లాడడం నాకు రాదు… పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి అని హెచ్చరించారు. తాను పక్కన ఉంటే మంత్రి వివేక్ ఓర్చుకోవడం లేదు… నేను కుర్చీలో కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు..సహచర మంత్రిని అంత మాట అన్నా వివేక్ చూస్తూ ఊరుకున్నాడు అని ఆరోపించారు.

Also Read:KTR:దేశంలో తీవ్రస్థాయికి అసహనం

- Advertisement -