- Advertisement -
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషితో దేవాలయాలకు పూర్వవైభవం వచ్చిందని, రాష్ట్రం సస్యశ్యామలం అయిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో దాత రెగమాటి రాంరెడ్డి (15 లక్షల 35 వేల) ఆర్థిక సహాయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులను మంత్రి దయాకర్ రావు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని బమ్మెర, పాలకుర్తి, వల్మిడి ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు నిధుల కేటాయించగా, పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
- Advertisement -