తెలంగాణ రాష్ట్రం వైద్యరంగంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.సోమవారం ఆయన హనుమకొండలోని రోహిణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తో కలిసి పాల్గొని, నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు.
ఈ సంధర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వైద్యరంగంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిందని, అదే స్థాయిలో హైద్రాబాద్ తర్వాత వరంగల్ ను అభివృద్ధి పరిచేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో నడుస్తున్న రోహిణి ఆసుపత్రి మరింత అభివృద్ధి చేందుతూ.. పేదలకు అందుబాటులో ఉండేలా మెరుగైన వైద్యం చేయడానికి కృషిచేయాలని సూచించారు.