యాదాద్రికి 100 ఆర్టీసీ మినీ బస్సులు..!

93
rtc
- Advertisement -

యాదాద్రి మహాసంప్రోక్షణ ముగియగా భక్తులకు దర్శనమిస్తున్నారు లక్ష్మీనరసింహస్వామి. ఇక భక్తుల సౌకర్యార్థం ఉప్పల్‌ బస్టాండ్‌ నుంచి యాదాద్రికి వందకుపైగా మినీ బస్సులు నడపనుంది ఆర్టీసీ. ఉప్పల్‌ నుంచి మినీ బస్సు సర్వీసులను ఎండీ సజ్జనార్‌తో కలిసి ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ ప్రారంభించారు.

ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఉప్పల్ సర్కిల్‌కు, అక్కడి నుంచి యాదగిరిగుట్టకు మినీ బస్సులు నడుపుతున్నామని చెప్పారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. అన్ని జిల్లా కేంద్రాల నుంచి యాదాద్రికి బస్సులు ఏర్పాటు చేశామన్నారు. వీఆర్‌ఎస్‌కు రెండు వేల మంది పేర్లు నమోదుచేసుకున్నారని సజ్జనార్‌ తెలిపారు. వీఆర్‌ఎస్‌ కోసం ఉద్యోగులను బలవంతం చేయట్లేదన్నారు.

జేబీఎస్‌ నుంచి రూ.100, ఉప్పల్‌ నుంచి రూ.75గా టికెట్‌ ధరను నిర్ణయించామని వెల్లడించారు. ప్రతి రోజూ 104 సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సాఫీగా సాగుతుందని చెప్పారు.

- Advertisement -