ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు హరికిషన్‌ మృతి…

712
harikishan
- Advertisement -

ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు హరికిషన్ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆచన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

1963.. మే 30న ఏలూరులో జన్మించారు. 8 ఏళ్ల వయసులోనే తన గురువులను తోటి వాళ్ల గొంతులను మిమిక్రీ చేయడాన్ని ప్రారంభించిన హరికిషన్‌ తర్వాత సినీ,రాజకీయ రంగాలకు చెందిన పలువురి గొంతును మిమిక్రీ చేసి ఆకట్టుకున్నారు.

ఎన్టీఆర్, కృష్ణ‌, శోభన్ బాబు, చిరు, నాగార్జున, బాల‌య్య‌ల‌తో పాటు ఈ త‌రం హీరోలు ప‌వ‌న్ , మ‌హేష్ ఇలా ప‌లువురు హీరోల గొంతుల‌ని ఎంతో అద్భుతంగా అనుక‌రిస్తూ వ‌చ్చారు. పశు పక్ష్యాదుల శబ్ధాలతో పాటు యంత్రాలు చేసే శబ్ధాలు,సంగీత వాద్య పరికరాల సౌండ్స్‌ను తన గొంతులో ప‌లికించారు. ఆయన మృతిపట్ల సినీ,రాజకీయ రంగాలకు చెందిన పలువురు నివాళి అర్పించారు.

- Advertisement -