టిక్‌టాక్‌లో తొలి రాజకీయపార్టీ..ఎంఐఎం

609
mim tik tok
- Advertisement -

టిక్ టాక్.. ఈమధ్యకాలంలో బాగా పాపులర్ అయిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్. సినిమాల్లోని పాటలు, పాపులర్ డైలాగ్స్, ఎమోషన్స్ ఇలా ఒకటేంటి అన్నింటినీ ఈ యాప్ ద్వారా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు ఎంటర్‌టైన్‌మెంట్‌కి మాత్రమే పరిమితం కాగా ఇకపై రాజకీయాలకు వేదిక కానుంది.

టిక్ టాక్ అకౌంట్‌ తెరిచిన తొలి రాజకీయా పార్టీగా ఎంఐఎం ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇప్పటికే ట్విట్టర్‌, ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో పార్టీ కార్యక్రమాలు, నేతల ప్రసంగాలకు కార్యకర్తలు, అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో మరో ముందడుగు వేసి టిక్ టాక్ అకౌంట్ ఓపెన్‌ చేసింది. సోషల్‌ మీడియా ద్వారా మరింత మందికి చేరే వ్యూహాంలో భాగంగా టిక్ టాక్‌ అకౌంట్ తెరచినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఎందుకంటే ఈ మధ్య కాలంలో మిగిలిన అన్ని సోషల్‌ మీడియా వేదికల కంటే టిక్‌ టాక్‌ వేగంగా దూసుకుపోతోంది. అందుకే మజ్లిస్ పెద్దలు టిక్ టాక్‌ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం ఏడువేలకు పైగా ఫాలోవర్లు టిక్‌టాక్‌లో ఎంఐఎంను ఫాలో అవుతున్నారు. మరి టిక్ టాక్‌ ద్వారా మజ్లిస్ నేతలకు ఎలాంటి స్పందన వస్తుందో వేచిచూడాలి.

- Advertisement -