ఎంఐఎం పక్షనేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. పాతబస్తీలోని సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ ను కోరారు. అప్జల్ గంజ్ మసీద్ మరమ్మతులు చేయాలని కోరారు. అక్బరుద్దీన్ ఓవైసీ వినతి మేరకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. దేవాలయం, మసీదు మరమ్మతులకు వెంటనే నిదులు విడుదల చేస్తామని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. రెండు ప్రార్ధన మందిరాల అభివృద్దికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు సీఎం.
రెండు ప్రార్థనామందిరాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, ఎంతో మంది ముస్లింలు నిత్యం ఈ మసీదులో ప్రార్థనలు చేస్తారన్నారు. దేశ వ్యాప్తంగా లాల్ దర్వాజ బోనాలుగా ప్రసిద్ధి చెందాయని గుర్తు చేశారు. ఇంతటి ప్రసిద్ధి ఉన్నప్పటికీ చాలినంత స్థలం లేకపోవడం వల్ల దేవాలయం ప్రాంగణం అభివృద్ధికి నోచుకోకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిజయజేశారు అక్బరుద్దీన్ ఓవైసీ.