ఎంఐఎం ముందుకు .. కాంగ్రెస్ వెనక్కి

694
telangana assembly
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీలో పార్టీల సీట్లు మారిపోయాయి. ఇప్పటివరకు ప్రధానప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఆ హోదా కొల్పోవడంతో సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఎంఐఎం ముందువరుసలో కూర్చుంది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు రెండో వరుసలో సీటు ఇచ్చారు.

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్ధానాల్లో గెలుపొందింది. వీరిలో 12 మంది టీఆర్ఎస్‌లో చేరగా కాంగ్రెస్‌కు 7గురు మిగిలారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పార్టీ బలం 6కి పడిపోయింది.

ప్రస్తుతం ఎంఐఎం ఎమ్మెల్యేల సంఖ్య 7గా ఉండటంతో ఎంఐఎంను ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -