మ‌న‌లో ఒక‌డికి మిలియ‌న్ క్లిక్స్..

304
rp patnaik manalo okadu
rp patnaik manalo okadu
- Advertisement -

ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టిస్తూ, సంగీతం అందిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన `మ‌న‌లో ఒక‌డు` ఆడియో ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రంలోని పాట‌ల‌కు చ‌క్క‌టి స్పంద‌న వ‌చ్చిన సంద‌ర్భంగా ఈ నెల 19న తిరుప‌తి వేదిక‌గా ఆడియో స‌క్సెస్ మీట్ జ‌రిగింది. మిలియ‌న్ క్లిక్స్ వేడుక‌గా ఈ స‌క్సెస్‌మీట్‌ను నిర్వ‌హించారు. ప్ర‌ముఖ గాయ‌కుడు, గాన గంధ‌ర్వుడు కె.జె.ఏసుదాస్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర యూనిట్‌కు మిలియ‌న్ క్లిక్స్ డిస్క్ ను అందించారు. .

గాన గంధ‌ర్వుడు కె.జె.ఏసుదాస్ మాట్లాడుతూ “నేను నా ఐదో ఏట సంగీతాభ్యాసాన్ని మొద‌లుపెట్టాను. మా నాన్న నాకు తొలి గురువు. `పాఠ‌శాల చ‌దువులని వ‌దిలెయ్‌. కానీ సంగీతం బాగా నేర్చుకో` అనిఆయ‌న న‌న్ను ఆశీర్వ‌దించారు. ఐదేళ్ల నుంచి ఇప్ప‌టిదాకా నేను సంగీతాన్ని నేర్చుకుంటూనే ఉన్నా. ఇప్ప‌టి గాయ‌నీగాయ‌కుల‌కు నేను చెప్పేది ఒక్క‌టే… ప్ర‌తిరోజూ సాధ‌న చేయాలి. లేకుంటే ఎద‌గ‌లేరు. ఎప్పుడైతే మ‌న‌కు అన్నీ తెలుసు అని అనుకుంటామో అప్పుడు అక్క‌డితో మ‌న వృద్ధి ఆగిన‌ట్టే. నా గురువులు, దేవుడు, అభిమానుల ఆశీర్వాదాలే న‌న్ను ఇంకో మెట్టు ఎక్కించాయి. . ప్ర‌తి ఒక్క‌రూ ఆరోగ్యాన్ని గురించి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. నేను ఇప్ప‌టికీ నా వాయిస్‌ని మెయింటెయిన్ చేస్తున్నా. గొంతును కాపాడుకోవ‌డం కోసం కొన్నిటిని వ‌దిలేశా. అయినా ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నా. మ‌న సంత‌తి మ‌న భార‌తీయ సంస్కృతిని గౌర‌వించ‌డం నేర్చుకోవాలి. ఏ భాషా సంస్కృతిని నేర్చుకున్న‌ప్పటికీ, మ‌నదైన సంస్కృతిని మ‌నం తెలుసుకోవాలి. నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నేను ఇప్ప‌టికీ విద్యార్థినే, విద్వాన్ ని కాదు“ అని అన్నారు.

manalo okadu

ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ “ఇప్ప‌టి వ‌ర‌కు హ‌య్య‌స్ట్ సీడీలు `అన్న‌మ‌య్య‌` ఆ త‌ర్వాత `జ‌యం` చిత్రానికే అమ్ముడుపోయాయి. హెక్సా, ఆక్టా ప్లాటిన‌మ్ డిస్క్ చేసిన చిత్రం `జ‌యం`. విదేశాల్లో తొలిసారి ఆడియో చేసిన సినిమా కూడా అదే. ల‌క్ష సీడీలు అమ్ముడుపోతే ప్లాటిన‌మ్ డిస్క్ అని అంటారు. కానీ ఇప్పుడు అన్ని అమ్ముడుపోవ‌డం లేదు. అందువ‌ల్ల ఒక‌వేళ ప్లాటిన‌మ్ డిస్క్ ఫంక్ష‌న్ అని వేడుక‌ను నిర్వ‌హించినా ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు. అయితే ఇప్పుడు జ‌నాలు క్లిక్స్ కి అల‌వాటు పడ్డారు . అందువ‌ల్ల ప్లాటిన‌మ్ డిస్క్ అనే ప‌దం క‌రెక్ట్ కాదు అని అనిపించి.. ఇక‌పై ప‌రిశ్ర‌మ ఫాలో కావాల్సిన ప‌దాన్ని మిలియ‌న్ క్లిక్స్ అనే పేరుతో ప్ర‌వేశ పెడుతున్నాం. ఈ సినిమాలో నాలుగు పాట‌లున్నాయి. ఒక మిలియ‌న్ క్లిక్స్ అంటే రెండున్న‌ర ల‌క్ష‌ల సీడీలు అమ్ముడుపోయిన‌ట్టు నా లెక్క‌. పెద్ద హీరోల సినిమాలు కూడా ఇదే విధానాన్ని ఫాలో అవుతార‌ని కోరుకుంటున్నాం. ఏసుదాస్‌గారిని పేరు పెట్టి పిలిచే అర్హ‌త కూడా మాకు లేదు. ఆయ‌న గాత్రం విప్పితే రోమాంఛితం కావ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఆయ‌న గాత్రం తో దైవ‌సాక్షాత్కారాన్ని అనుభ‌వించ‌వ‌చ్చు. ఇలాంటి హిస్టారిక‌ల్ మూమెంట్‌లో అలాంటి దేవుడు పాల్గొన‌డం మాకు చాలా ఆనందంగా ఉంది“ అని అన్నారు.

గుర‌జాల జ‌గ‌న్‌మోహ‌న్ మాట్లాడుతూ “మా తొలి అడుగుకు ఏసుదాస్‌గారి ప్రోత్సాహం ఉండ‌టం మా సుకృతం. మేం ఈ సినిమా చేయ‌డానికి కార‌ణం ఆర్పీ ప‌ట్నాయ‌క్‌. స‌మాజంలో సామాన్యుడు ఏం చేయ‌గ‌లుగుతాడు? అదీ ఓ మీడియా నేప‌థ్యంలో జ‌రిగేట‌ప్పుడు ఎలా ఉంటుంది? అనే క‌థ‌తో ఆయ‌న మా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. ఈ సినిమాను సౌత్ ఇండియా మొత్తం చూసి ఆశీర్వ‌దిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది. మా సంస్థ‌లో ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు“ అని చెప్పారు.

manalo okadu million views

ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ శివ‌ప్ర‌సాద్‌, తిరుప‌తి ఎమ్మెల్యే సుగుణ‌మ్మ‌తో పాటు ప‌లువురు శాస‌న‌స‌భ్యులు, రాజ‌కీయ ప్ర‌ముఖులు, `మ‌న‌లో ఒక‌డు` చిత్ర క్రియేటివ్ హెడ్ గౌతం ప‌ట్నాయ‌క్‌, కెమెరామేన్ ఎస్‌.జె.సిద్ధార్థ్‌, మాట‌ల ర‌చ‌యిత తిరుమ‌ల నాగ్‌, పాట‌ల ర‌చ‌యిత‌లు చైత‌న్య ప్ర‌సాద్‌, వ‌న‌మాలి, పుల‌గం చిన్నారాయ‌ణ‌, గాయ‌కుడు హేమ‌చంద్ర‌, గాయ‌ని సునీత, శ్రావ‌ణ భార్గ‌వి, స‌హ నిర్మాత‌లు ఉమేశ్ గౌడ‌, బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -