Microsoft: మైక్రోసాప్ట్ విండోస్ క్రాష్

35
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట విండోస్‌లో సమస్యలు తలెత్తడంతో చాలా దేశాల్లో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అమెరికా,ఆస్ట్రేలియా,భారత్ సహా పలు దేశాల్లో సమస్య ఏర్పడింది. లండన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ కూడా నిలిచిపోయింది. అమెరికా 911 ఎమర్జెన్సీ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానాశ్రయాల్లో మాన్యువల్‌గా చెక్ చేసి ప్రయాణీకులను పంపిస్తున్నారు. టెలీ కమ్యూనికేషన్లతో పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడింది.

మైక్రోసాప్ట్ విండో యూజర్లకు బ్లూ స్క్రీన్ అప్ డేట్ సమస్య ఎదురయ్యింది. దీంతో గందరగోళం నెలకొంది. కొందరు యూజర్లు తమ సమస్యను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎర్రర్ సందేశాన్ని చూపిస్తూ రీస్టార్ట్ చేయమని చూపిసోందని మైక్రోసాప్ట్ విండోస్ యూజర్స్ చెబుతున్నారు.

ఇక కొంతమంది ఈ సమస్యను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల దృష్టికి కూడా తీసుకెళ్లారు. మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోవడంతో ఆర్ధికంగా నష్టం వాటిలే అవకాశం ఉంది.

Also Read:శ్రీవిష్ణు… ‘శ్వాగ్’ అప్‌డేట్

- Advertisement -