కరోనా లాక్ డౌన్ ప్రపంచదేశాలు కుదిపేశాయి. కరోనాతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుదేలవ్వగా ముఖ్యంగా ఐటీ కంపెనీలపై పెద్ద ప్రభావాన్ని చూపాయి. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యత ఇవ్వగా తాజాగా పలు కంపెనీలు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌కి ప్రాధాన్యతనిస్తున్నాయి.
తాజాగా ఈ బాటలో మైక్రో సాఫ్ట్ చేరింది. తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఉద్యోగుల పనితీరు ఆధారంగా పర్మనెంట్‌గా ఇంటి నుంచే పని చేసే సౌలభ్యాన్ని కల్పించనున్నారు.
అమెరికాలోని తన ఆఫీసులను జనవరి వరకు ఓపెన్ చేసేదిలేదని కూడా మైక్రోసాఫ్ట్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేయాలనుకుంటే, వాళ్లు ఆఫీసులో తమ స్పేస్‌ను వదులుకోవాల్సి ఉంటుందని సంస్థ చెప్పింది. పర్మనెంట్ పద్ధతిలో ఇంటి నుంచి పని చేయాలనుకున్నవాళ్లు తమ మేనేజర్ల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.