మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా సత్యనాదెళ్ల

203
nadella
- Advertisement -

టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నూతన ఛైర్మన్‌గా భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్‌ జాన్‌ తాంసన్‌ స్థానంలో, ప్రస్తుత సీఈవోను కొత్త ఛైర్మన్‌గా కంపెనీ ఎంపిక చేసింది. 2014 లోమైక్రోసాఫ్ట్‌ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు.

2014 లో సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన నాదెళ్ల, లింక్డ్ఇన్, న్యూయాన్స్ కమ్యూనికేషన్స్ , జెనిమాక్స్ లాంటి బిలియన్ డాలర్ల కొనుగోళ్లు, అనేక డీల్స్‌తో మైక్రోసాఫ్ట్‌ వృద్దిలో కీలకపాత్ర పోషించారు.

2014లో బిల్ గేట్స్ నుంచి చైర్మ‌న్ ప‌ద‌విని అందుకున్న థాంప్స‌న్‌.. ఇక నుంచీ స్వ‌తంత్ర డైరెక్ట‌ర్‌గా కొన‌సాగ‌నున్న‌ట్లు సంస్థ వెల్ల‌డించింది. గ‌తేడాది బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి కూడా త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -