తెలంగాణలో మైక్రో బ్రూవరీలు

2
- Advertisement -

తెలంగాణలో విచ్చలవిడిగా మైక్రో బ్రూవరీలు రాబోతున్నాయి. ఇక నుండి హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, పర్యాటక ప్రదేశాల్లో కూడా బీర్ల అమ్మకాలు జరగనున్నాయి. 1000 చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు.. దరఖాస్తుకు రూ.1 లక్ష మాత్రమే.

బీర్ కావాలంటే వైన్స్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇక నుండి తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ బీర్ దొరకబోతుంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(TCUR)తో పాటు కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీలకు అనుమతిచ్చింది ఎక్సైజ్ శాఖ.

TCUR పరిధిలోని జీహెచ్ఎంసీ, బోడుప్పల్, జవహర్ నగర్, పీర్జాదిగూడ, బడంగ్ పేట్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట్, మీర్ పేట్ పరిధిలో కూడా దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. నిబంధనల ప్రకారం ఎన్ని దరఖాస్తులు వచ్చినా అన్ని అనుమతులు ఇస్తామని తెలిపింది ఎక్సైజ్ శాఖ.

Also Read:పాత వీడియో..తప్పు ఒప్పుకున్నా:వంటేరు

- Advertisement -