అవిశ్వాస తీర్మానంలో ఓడిన ఫ్రాన్స్‌ ప్ర‌ధాని

3
- Advertisement -

ఫ్రాన్స్ దేశ చరిత్రలో తొలిసారి. అవిశ్వాస తీర్మానంలో ఓడారు ప్రధాని మైఖేల్ బార్నియర్. జాతీయ పార్లమెంట్‌లో జరిగిన అవిశ్వాస తీర్మానంలో బార్నియర్‌కు వ్య‌తిరేకంగా 331 మంది ఓటేశారు. దీంతో ప్రభుత్వం కూలిపోయింది. బార్నియర్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే ప్రభుత్వం పడిపోవడం విశేషం.

బ‌డ్జెట్ కేటాయింపుల‌పై మొద‌లైన ర‌గ‌డ‌ ప్ర‌ధాని పీఠానికే ఎస‌రుపెట్టింది. అయితే అవిశ్వాసంలో ఓడినా ప్ర‌ధాని బార్నియ‌ర్‌.. ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌నున్నారు. ఆప‌ద్ద‌ర్మ ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాల‌ను రూపొందించే వీలు ఉండ‌దు. ప్ర‌స్తుత పార్ల‌మెంట్‌లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లేని కార‌ణంగా.. కొత్త ప్ర‌ధాని ఎన్నిక సంక్లిష్టంగానే మార‌నుంది.

కొత్త ప్ర‌ధాని రేసులో సైనిక శాఖ మంత్రి సెబాస్టియ‌న్ లెకోర్న్ ,సెంట్రిస్టు మోడెమ్ పార్టీ నేత ఫ్రాంకోయిస్ బేరౌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

Also Read:ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌..

- Advertisement -