ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పాప్ లెజెండ్ మైకేల్ జాక్సన్ జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బయోపిక్ ‘మైకేల్’ మూవీ ట్రైలర్ తాజాగా గ్రాండ్‌గా విడుదలైంది. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు మైకేల్ మళ్లీ తిరిగి వచ్చినట్టే ఉందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రంలో మైకేల్ జాక్సన్ పాత్రను ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించడం ప్రధాన ఆకర్షణగా మారింది. లుక్, డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్ అన్నింట్లోనూ జాఫర్ అచ్చం మైకేల్‌ను గుర్తు చేసేలా కనిపించారు. ముఖ్యంగా ఆయన సిగ్నేచర్ మూన్‌వాక్ స్టెప్పులు అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.
దర్శకుడు అంటోయిన్ ఫుక్వా ఈ సినిమాను కేవలం బయోపిక్‌గా కాకుండా, మైకేల్ వ్యక్తిగత జీవితంలోని సంఘర్షణలు, భావోద్వేగాలను సున్నితంగా చూపించినట్లు ట్రైలర్ స్పష్టంచేస్తోంది. చిన్ననాటి ప్రయాణం నుంచి గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్‌గా ఎదిగిన క్రమాన్ని గ్రాండ్ విజువల్స్‌తో ఆవిష్కరించనున్నారు.

