ముంబయి ఇండియన్స్ ఎట్టకేలకు ఐపీఎల్-11లో తొలి విజయం సాధించింది. మంగళవారం సొంతగడ్డపై ఆ జట్టు 46 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. మొదట రోహిత్, లూయిస్ మెరుపులతో ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం కృనాల్ పాండ్య (3/28), బుమ్రా (2/28), మెక్లెనగన్ (2/24)ల ధాటికి బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ కోహ్లి కడదాకా క్రీజులో నిలిచినా. అతడికి సహకరించే వారే కరవయ్యారు. నాలుగు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరుకిది మూడో పరాజయం.
ముంబయి ఇండియన్స్: సూర్యకుమార్ (బి) ఉమేశ్ 0; లూయిస్ (సి) డికాక్ (బి) అండర్సన్ 65; ఇషాన్ కిషన్ (బి) ఉమేశ్ 0; రోహిత్ (సి) వోక్స్ (బి) అండర్సన్ 94; కృనాల్ పాండ్య రనౌట్ 15; పొలార్డ్ (సి) డివిలియర్స్ (బి) వోక్స్ 5; హార్దిక్ పాండ్య నాటౌట్ 17; మెక్లెనగన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 17;
మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 213;
వికెట్ల పతనం: 1-0, 2-0, 3-108, 4-148, 5-178, 6-207; బౌలింగ్: ఉమేశ్ 4-0-36-2; వోక్స్ 3-0-31-1; సుందర్ 2-0-32-0; సిరాజ్ 4-0-34-0; చాహల్ 3-0-32-0; కోరె అండర్సన్ 4-0-47-2
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: కోహ్లి నాటౌట్ 92; డికాక్ (బి) మెక్లెనగన్ 19; డివిలియర్స్ (సి) హర్దిక్ (బి) మెక్లెనగన్ 1; మన్‌దీప్ (స్టంప్డ్) ఇషాన్ కిషన్ (బి) కృనాల్ 16; అండర్సన్ (సి) డుమిని (బి) కృనాల్ 0; వాషింగ్టన్ సుందర్ (సి) సూర్యకుమార్ (బి) కృనాల్ 7; సర్ఫరాజ్ (స్టంప్డ్) తారె (బి) మార్కండే 5; వోక్స్ (సి) కృనాల్ (బి) బుమ్రా 11; ఉమేశ్ (సి) రోహిత్ (బి) బుమ్రా 1; సిరాజ్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 7;
మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 167;
వికెట్ల పతనం: 1-40, 2-42, 3-75, 4-75, 5-86, 6-103, 7-135, 8-137; బౌలింగ్: బుమ్రా 4-0-28-2; కృనాల్ పాండ్య 4-0-28-3; మెక్లెనగన్ 3-0-24-2; ముస్తాఫిజుర్ 4-0-55-0; మార్కండే 4-0-25-1; హర్దిక్ పాండ్య 1-0-4-0.