మెట్రో డీపీఆర్‌ రెడీ..ఏడు కారిడార్లు!

17
- Advertisement -

మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్ కార్యాచరణను వేగవంతం చేసింది. ఇప్పటికే రెండో దశ విస్తరణకు సంబంధించి సమగ్ర నివేదక రెడీ చేయాలని ఆదేశించగా ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

7 మెట్రో కారిడార్‌లలో మొత్తం 70 కి.మీ మేర నిర్మించే మార్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో సర్వేలు, ట్రాఫిక్‌ అధ్యయనం, మెట్రో స్టేషన్‌లు, డిపోల నిర్మాణం వంటి అంశాలపై డీపీఆర్‌ను రూపొందిస్తున్నారు. ప్రాధమికంగా సెకండ్ ఫేజ్ మెట్రో కోసం రూ.20వేల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. జూన్‌ 4 తర్వాత కోడ్‌ ముగిసిన వెంటనే రెండో దశ మెట్రోకు సంబంధించిన డీపీఆర్‌లను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం.

మొదటి దశలోని కారిడార్‌-3 (నాగోల్‌ -రాయదుర్గం) 29 కి.మీ ఉండగా, రెండో దశలో నాగోల్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మరో 29 కి.మీ, అదేవిధంగా రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ వరకు 8 కి.మీ కలిపి మొత్తం 66 కి.మీ మెట్రో మార్గం అనుసంధానం కానుంది. ఇక మెట్రో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు తప్పే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Also Read:శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -