NVS Reddy:సీఎం కేసీఆర్ విజన్‌తోనే మెట్రో ముందడుగు

44
- Advertisement -

సీఎం కేసీఆర్ విజన్‌తోనే మెట్రోకు ముందడుగు పడిందన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. హ:దరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన నాగోల్ నుండి ఎల్బీనగర్‌ వరకు మెట్రోను అనుసంధానిస్తామన్నారు. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రోను గతంలోనే ప్రతిపాదించానని కానీ అప్పటి కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోలేదన్నారు.

ఎల్బీనగర్‌ నుండి పెద్ద అంబర్ పేట వరకు 8 స్టేషన్లు ఉండనున్నాయని చెప్పారు. తార్నాక నుండి మౌలాలి వరకు 5 స్టేషన్లతో మెట్రో విస్తరణ ఉండనుందన్నారు. ఉప్పల్ నుండి బీబీ నగర్ వరకు 25 కిమీ మేర మెట్రో ఉండనుందన్నారు. శంషాబాద్ నుండి షాద్ నగర్ వరకు 28 కిలోమీటర్ల మెట్రో విస్తరణ ఉండనుందన్నారు.

Also Read:CM KCR:అమ్మ ఒడి వాహనాలు ప్రారంభం..

ఎంజీబీఎస్ నుండి ఫలక్ నుమా వరకు మెట్రో విస్తరణ ఉండనుందన్నారు. జేబీఎస్ నుండి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం చేపట్టనున్నామన్నారు. కోటి జనాభాకు సరిపోయేలా మెట్రో విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇవన్నీ ప్రిలిమినరీ ప్రాజెక్టు రిపోర్టు దశలో ఉన్నాయని పేర్కొన్నారు.

Also Read:ముగ్గురు హీరోయిన్లను వేధించారట

- Advertisement -