కోలీవుడ్ అగ్రకథానాయకుడు విజయ్ తాజా చిత్రం ‘మెర్సెల్’ . అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ మూడు పాత్రల సరసన కాజల్ .. సమంతా .. నిత్యామీనన్ కథానాయికలుగా అలరించనున్నారు. దీపావళికి అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.
నిన్న( 21వ తేదీన) ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఒక్క రోజులోనే ఈ టీజర్ కోటి వ్యూస్ ను సాధించి.. సినిమాపై అంచనాలు పెంచేసింది. విజయ్ కి గల క్రేజ్ కు .. ఈ సినిమా పట్ల అభిమానులు చూపుతోన్న ఆసక్తికి ఈ వ్యూస్ కొలబద్దగా చెప్పుకుంటున్నారు. విజయ్ కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తుందని అంటున్నారు. తెలుగులో ‘అదిరింది’ పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో తుపాకితో హిట్ కొట్టిన విజయ్.. ఈ సారి కూడా తెలుగులో హిట్ కొట్టడం ఖాయమనే అంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీతేనాన్‌ండల్ ఫిల్మ్స్ చిత్రాన్ని నిర్మించగా.. తెలుగులో నిర్మాత శరత్ మరార్ విడుదల చేయబోతున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.