రివ్యూ‌: మెంటల్‌ మదిలో..

294
- Advertisement -

రీసెంట్ గా  వచ్చిన చిన్న సినిమా పెళ్లి చూపులు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ తరహాలోనే వచ్చిన మరో మూవీ మెంటల్ మదిలో. పెళ్లి చూపులు నిర్మాతే ఈ సినిమాను కూడా నిర్మించడంతో విడుదలకు ముందే మంచి హైప్ క్రియేటైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ పెళ్లి చూపులు  మ్యాజిక్ ను  రిపీట్ చేసిందా లేదా చూద్దాం.

కథ:

అరవింద్‌ కృష్ణ(శ్రీవిష్ణు)ది చిన్నప్పటి నుంచి ఓ కన్‌ఫ్యూజన్‌ మైండ్‌. అతడికి ఏం కావాలో అతనికే స్పష్టత ఉండదు. అలాంటి వ్యక్తికి స్వేచ్ఛ(నివేదా పేతురాజు)తో పెళ్లి కుదురుతుంది. స్వేచ్ఛ స్వతంత్ర భావాలున్న అమ్మాయి. అరవింద్‌ కృష్ణను చాలా ఇష్టపడుతుంది. అతడి మైండ్‌ సెట్‌ని మార్చడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తుంది.ఈ సమయంలో అరవింద్‌ కృష్ణకు ముంబయి ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. ముంబయి వెళ్లాక కృష్ణలో అనుకోని మార్పు వస్తుంది. రేణు పరిచయంతో అరవింద్‌ కథ పూర్తిగా మారిపోతుంది. ఇంతకీ రేణు ఎవరు? ఆమె వల్ల వచ్చిన మార్పులేంటి? చివరికి కథ సుఖాంతమైందా? లేదా?  అన్నది తెరమీద చూడాల్సిందే.

Mental Madhilo Review
ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కథనం,శ్రీవిష్ణు, నివేదా పేతురాజు, రేణు నటన,మ్యూజిక్.  శ్రీవిష్ణు నటుడిగా ఆల్రెడీ ప్రూవ్ డ్.ఇలాంటి టైలర్ మేడ్ క్యారెక్టర్ లో చాలా సహజంగా నటించి ఆకట్టుకున్నాడు. ఈ కథకు మూడు పాత్రలు కీలకం. శ్రీ విష్ణు, నివేతా పేతురాజు, రేణు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎవరి నటనా అసహజంగా అనిపించదు. చాలా రోజుల తర్వాత శివాజీరాజా ఓ మంచి పాత్రలో నటించారు. ఒక మధ్య తరగతి తండ్రిగా ఆయన నటన ఆకట్టుకుంటుంది. మిగితా నటీనటులు తమ పరిధిమేరకు  ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్  స్లోనరేషన్‌,సెకండాఫ్ ప్రారంభం. సెకండాఫ్ స్టార్టింగ్ టేకాఫ్ కాసింత ఒడుదొడుకుల‌కు లోనైన‌ట్టు అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. ప్రతీ ఫ్రేమ్‌లో దర్శకుడి పనితనం కనిపిస్తుంది.   ప్రశాంత్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు. సినిమా మూడ్ కు తగ్గట్టు ఆర్.ఆర్ ఇచ్చి సినిమాకు ప్లస్ అయ్యాడు.  సినిమాటోగ్రఫీ  పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Mental Madhilo Review
తీర్పు:

చిన్న లైన్‌. దాన్ని రెండు గంటల పాటు సినిమాగా మలచడం చాలా కష్టం. దర్శకుడు ఆత్రేయ మాత్రం దాన్ని సులభంగా దాటేశాడు. కథనం,శ్రీవిష్ణు,నివేదా,రేణు నటన సినిమాకు ప్లస్ కాగా స్లోనేరేషన్ మైనస్ పాయింట్స్‌. పెళ్లి చూపులు  సినిమా తర్వాత న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరీలు ఇష్టపడే ప్రతిఒక్కరికి నచ్చే చిత్రం  మెంటల్‌ మదిలో.

విడుదల తేదీ:24/11/2017
రేటింగ్:2.75/5
నటీనటులు: శ్రీవిష్ణు,నివేతా పేతురాజు
సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌ విహారి
నిర్మాత: రాజ్‌ కందుకూరి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ

- Advertisement -