నిర్మాత రాజ్ కందుకూరి తన ఇంతకు ముందు చిత్రం పెళ్ళిచూపులు తర్వాత పస్తుతం “మెంటల్ మదిలో” చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ద్వారా షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయను వెండితెరకు పరిచయం చేస్తున్నారు. శ్రీ విష్ణు, నివేథ పెతురాజ్ ప్రధాన తారాగణం. ప్రశాంత్ విహారి : సంగీతం, వెదరామన్ : కెమెరా, విప్లవ్ : ఎడిటింగ్. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని జూలై చివరి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత రాజ్ కందుకూరి తెలిపారు.
ఈ చిత్రంలోని “ఊహలె” అనే పాట లిరికల్ వీడియోను ఈ రోజు సాయంత్రం 5-30 కి విడుదల చేస్తున్నట్టు రాజ్ తెలిపారు. ఈ పాట యువతని మరియు ప్రతి ఒక్కరి మనసుల్ని దోచుకుంటుందని రాజ్ తెలిపారు. ఈ సినిమా ఆడియో మధుర ఆడియో ద్వార విడుదల అవుతుందని చెప్పారు.