‘పెళ్ళి చూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి ప్రస్తుతం తన తదుపరి చిత్రంగా ‘మెంటల్ మదిలో’ తీస్తున్నారు. లఘు చిత్ర డైరెక్టర్ వివేక్ ఆత్రేయ వెండితెరకు దర్శకుడిగా ఈ సినిమా ద్వారా పరిచయమవుతున్నారు. శ్రీ విష్ణు, నివేథ పెతురాజ్ ప్రధాన తారాగణం. ప్రశాంత్ విహారి : సంగీతం, వెదరామన్ : కెమెరా, విప్లవ్ : ఎడిటింగ్. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని జూలై చివరి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత రాజ్ కందుకూరి తెలిపారు. ఈ సందర్భంగా కొత్త లుక్‌ని విడుదల చేస్తూ విడుదల తేదీని అనౌన్స్ చేశారు.
ఈ మధ్యే విడుదలై సంచలనం క్రియేట్ చేసిన మల్టీ స్టారర్ అప్పట్లో ఒకడుండేవాడు. ఈ చిత్రంలో నారా రోహిత్ తో పాటు శ్రీ విష్ణు కీలక పాత్ర పోషించాడు. ఇందులో విష్ణు నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ నటుడు ప్రేమ ఇష్క్ కాదల్, నల దమయంతి, సన్ ఆఫ్ సత్యమూర్తి, జయమ్ము నిశ్యయమ్మురా వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించాడు. తాజాగా మెంటల్ మదిలోతో ఆకట్టుకునేందుకు సిద్దమయ్యాడు.