“మెంటల్ మదిలో” డబ్బింగ్ షురూ..

200
- Advertisement -

ప్రపంచ సినిమా స్థాయిలో ఇప్పుడిప్పుడే తెలుగు చిత్రసీమ ఎదుగుతోంది. నిర్మాణం పరంగా కొత్త పుంతలు తొక్కుతోంది. తెలుగు నేటివిటీతో ప్రపంచస్థాయి సినిమాలు తీయవచ్చని ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకొంటున్నారు. “పెళ్ళిచూపులు”తో సినిమా నిర్మాణంలో సరికొత్త ఒరవడి సృష్టించారు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి. తాజాగా ఆయన నిర్మిస్తున్న చిత్రం “మెంటల్ మదిలో”.
 Mental Madhilo Dubbing Begins..
న్యూ ఏజ్ యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు-నివేతా పేతురాజ్ జంటగా నటిస్తుండగా యువ ప్రతిభాశాలి వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావచ్చిన ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు నేటితో మొదలయ్యాయ్.
  Mental Madhilo Dubbing Begins..
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. “”పెళ్ళిచూపులు” విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఓ వైవిధ్యమైన కథాంశంతో ఈ “మెంటల్ మదిలో” చిత్రాన్ని నిర్మిస్తున్నాను. శ్రీవిష్ణు-నివేతాల జంట చాలా బాగుంది, శ్రీవిష్ణు నేచురల్ పెర్ఫార్మెన్స్, వివేక్ ఆత్రేయ టేకింగ్ “మెంటల్ మదిలో” చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. మా ధర్మపధ క్రియేషన్స్ బ్యానర్ నుంచి వస్తున్న మరో మంచి చిత్రం “మెంటల్ మదిలో” అని గర్వంగా చెప్పగలను. ఇవాళే డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టాం.. జూలైలో “మెంటల్ మదిలో” చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే ట్రైలర్ మరియు ఆడియో విడుదల తేదీలు ప్రకటిస్తాం” అన్నారు.  ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: వంశీ శేఖర్, సినిమాటోగ్రఫీ: వేదరామన్, సంగీతం: ప్రశాంత్ విహారీ, ఎడిటర్: విప్లవ్ న్యాషాదమ్, నిర్మాత: రాజ్ కందుకూరి, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ!

- Advertisement -