మేమ్ ఫేమస్..మినిమమ్ సాంగ్‌ లాంచ్‌

50
- Advertisement -

‘రైటర్ పద్మభూషణ్’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ హిలేరియస్ మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ని అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి నిర్మిస్తున్నారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కళ్యాణ్ నాయక్ సంగీతం అందించిన ఫస్ట్ సింగిల్ అయ్యయ్యో ప్లజంట్ మెలోడీకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు, సెకండ్ సింగిల్ మినిమమ్‌ను లాంచ్ చేశారు. ఇది మొదటి దానికి పూర్తిగా భిన్నమైన ట్రాక్. ఈ మాస్ నెంబర్ యూత్ స్టైల్ స్వాగ్ ని చూపుతుంది. సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల , మౌర్య చౌదరి దినచర్యను ప్రజెంట్ చేసింది. వారు రోజంతా చిల్ గా ఉంటారు. ఎవరినీ పట్టించుకోరు.

Also Read: ఏజెంట్‌ ఒక యాక్షన్.. థ్రిల్ : సాక్షి వైద్య

మొదటి పాటను పాడిన రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటని పాడారు. హై పిచ్ వోకల్స్‌తో మాస్ ఎనర్జీని నింపారు . కంపోజర్ కళ్యాణ్ నాయక్, కోటి మామిడాలతో కలసి సాహిత్యం అందించారు. సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి గ్రామీణ ప్రాంతాల్లో చిచోరా బ్యాచ్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది యూత్‌తో పాటు మాస్‌ని అలరించేలా ఉంది.

Also Read: Pushpa 2: బన్నీతో తారక్ భేటీ

శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సృజన అడుసుమిల్లి ఎడిటర్, అరవింద్ మూలి ఆర్ట్ డైరెక్టర్. మేమ్ ఫేమస్ జూన్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -