మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత బౌలర్లు దుమ్ములేపారు. ఓవర్ నైట్ స్కోరు 8 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్‌ను విలవిలలాడించారు భారత బౌలర్లు. ముఖ్యంగా బుమ్రా ధాటికి ఆసీస్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 151 పరుగులకే ఆలౌటైంది ఆసీస్. కేవలం 15.5 ఓవర్లు వేసిన బుమ్రా 6 వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. దీంతో భారత్‌కి 292 పరుగుల ఆధిక్యం లభించింది.
ఆసీస్ బ్యాట్స్‌మెన్స్‌లో హారిస్ (22), ఫించ్(8), ఖువాజా(21), షాన్ మార్ష్ (28), హెడ్ (20), మిచెల్ మార్ష్ (9) పరుగులు చేసి ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో ఆసీస్ సారథి టిమ్‌పైన్(12), కమిన్స్ (2) ఉన్నారు .49 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. భారత్ 329 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఇప్పటి వరకు 9 టెస్ట్‌లు ఆడి ఏకంగా 45 వికెట్స్ పడగొట్టాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరంగేట్రం చేసిన ఏడాది అత్యధిక వికెట్స్ తీసిన భారత బౌలర్లలో బుమ్రా టాప్‌లో నిలిచాడు. మిగితా బౌలర్లలో జడేజా రెండు వికెట్స్ తీయగా,మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీశారు.