టీకా తీసుకున్న మెహరీన్‌..

191
mehreen
- Advertisement -

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్ తొలి టీకా ప్రక్రియ పూర్తికాగా పలువురు సెలబ్రెటీలు సైతం వ్యాక్సిన్ వేయించుకుని అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా నటి మెహరీన్‌ కూడా టీకా వేయించుకున్నారు.

తాను టీకా వేయించుకున్న ఫోటోని షేర్ చేసిన మెహరీన్….అందరూ విధిగా టీకా వేసుకోవాలని సూచించింది. దీన్ని నేషనల్ డ్యూటీగా భావించాలని వెల్లడించింది.

ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా మెహ్రీన్ పెళ్లి వేడుక వాయిదా పడిన సంగతి తెలిసిందే. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఎఫ్3’ సినిమాతో పాటు, మారుతి దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ లోను నటిస్తోంది ఈ అందాల ముద్దుగమ్మ.

- Advertisement -