హీరోయిన్ మెహ్రీన్ నిశ్చితార్ధం..

182
Actress Mehreen
- Advertisement -

గత కొద్దిరోజులుగా టాలీవుడ్‌ బ్యూటీ మెహ్రీన్ కౌర్ పెళ్లి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ అమ్మడు రహస్యంగా ప్రియుడితో నిశ్చితార్ధం జరుపుకుంది. గ‌త కొద్ది రోజులుగా హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ కుమారుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్‌ కుమారుడు భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌నుందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆ వార్త‌ల‌ని నిజం చేస్తూ శుక్ర‌వారం మెహ్రీన్- భ‌వ్య నిశ్చితార్ధం జ‌రుపుకున్నారు.

ఈ వేడుక‌కు సంబంధించిన ఫొటోల‌ను మెహ్రీన్ సోద‌రుడు త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌గా, ఇవి వైర‌ల్‌గా మారాయి.కృష్ణ‌గాడి వీర ప్రేమక‌థ చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవ‌ల వ‌చ్చిన ఎఫ్2 చిత్రంలో హ‌నీ పాత్ర పోషించి తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ప్ర‌స్తుతం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఎఫ్ 3 అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీని ఆగ‌స్ట్ 27న విడుద‌ల కానుంది.

- Advertisement -