కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదరుచూస్తున్న దర్శకుడు పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్‌ని రీ లాంచ్ చేస్తూ తెరకెక్కించిన చిత్రం మెహబూబా. ఆంధ్రాపోరీ చిత్రంతో హీరోగా మారిన ఆకాష్ ఆ సినిమా ఆశించినంత సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో తన రెండో సినిమాతోనైనా తానేంటో నిరూపించుకోవాలని ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరి సైతం తన మార్క్ స్టైల్‌ను పక్కన పెట్టి డిఫరెంట్ జోనర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..?మరి పూరి చేసిన ఈ ప్రయత్నం ఫలించిందా..?ఆకాష్ హీరోగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడా లేదా చూద్దాం..
కథ:
హైదరాబాద్ కుర్రాడు రోషన్ (ఆకాశ్)కు చిన్నప్పటి నుంచి గత జన్మ జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. బీటెక్ పూర్తిచేసిన రోషన్ తనకి హిమాలయాలతో ఏదో బంధం ఉందని అందరితో చెబుతుంటాడు. మిలిటరీలోకి వెళ్లే క్రమంలోనే పాకిస్థాన్‌కు చెందిన అఫ్రీన్ (నేహా శెట్టి)ని కలుస్తాడు. ఓ ప్రమాదం నుంచి అఫ్రీన్‌ను రక్షిస్తాడు. సీన్ కట్ చేస్తే వీరిద్దరూ ప్రేమలో పడతారు….ఇద్దరికీ గత జన్మలోనూ బంధం ఉందని తెలుసుకుంటారు..?అసలు వీరిద్దరికి గత జన్మ బంధం ఏమిటీ..?ఎలా ఒక్కటయ్యారు…?అన్నదే మెహబూబా కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ ఆకాశ్ నటన, ఫస్టాఫ్లో కొన్ని డైలాగ్స్, సినిమాటోగ్రఫీ, కథనం, మాటలు. ఫస్ట్ సినిమా కంటే ఈ సినిమాలో ఆకాశ్ అద్భుత నటనను కనబర్చాడు. ఓ విధంగా చెప్పాలంటే పూరి తీసిన విధానం కంటే ఆకాశ్ నటనే సినిమాకి హైలైట్ అనిపిస్తుంది. హీరోయిన్ నేహా శెట్టి అందం, అభినయం ఆకట్టుకుంటాయి. మిగితా పాత్రల్లో మురళీ శర్మ, సయాజీ షిండే తమ పాత్రలకు న్యాయం చేయగా మిగితా వారికి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఈ చిత్రం పూరీ తీసిన గత సినిమాల కంటే భిన్నంగా అనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ కథ,సెకండాఫ్‌లో వేగం తగ్గడం,స్క్రీన్ ప్లే,లాజిక్ లేని సీన్స్, పూరి మార్క్ మిస్సవడం. తన రెగ్యులర్ స్టైల్‌ను పక్కన పెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ టేకింగ్‌తో సినిమా చేశాడు పూరి. కానీ ఆ ప్రయత్నం ఏ మాత్రం ఆకట్టుకోలేదు. పునర్జన్మల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. యాక్షన్ ఎపిసోడ్స్ లేకపోవటం నిరాశకలిగిస్తుంది. కథనంలో వేగం లేకపోవటం, ఏ మాత్రం లాజిక్ లేని సన్నివేశాలు ఇది పూరి సినిమానేనా అన్న భావన కలిగిస్తాయి.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. సినిమాటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ సహజంగా తీర్చిదిద్దారు. చాలా రోజుల తరువాత తెలుగు సినిమాకు సంగీతమందించిన సందీప్ చౌతా పరవాలేదనిపించాడు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. రియల్ లొకేషన్లలో సినిమాను చిత్రీకరించారు. దీంతో అడుగడుగునా నిర్మాణ విలువలు కన్పిస్తాయి.
తీర్పు:
ఆకాష్‌కే కాదు మెహబూబా పూరి జగన్నాథ్‌కు కూడా రీలాంచ్ లాంటిందే. కలిసి జీవించేందుకు జన్మజన్మలుగా తపన పడిన రెండు మనసుల కథ ఇది. పూరీ ఒక విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా ‘మెహబాబూ’ను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్ వరకు సినిమా ఆసక్తిగానే ఉన్న తర్వాత బోర్ కొట్టిస్తుంది. ఓవరాల్‌గా పర్వాలేదనిపించే మూవీ మెహబూబా.
విడుదల తేది:11/05/2018
రేటింగ్:2.25/5
నటీనటులు: ఆకాశ్ పూరీ, నేహా శెట్టి
సంగీతం: సందీప్ చౌతా
నిర్మాతలు: పూరీ జగన్నాథ్, చార్మి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాథ్