చిరంజీవికి మేఘన కన్నీటి వీడ్కోలు

316
chiranjeevi meghana
- Advertisement -

క‌న్న‌డ ‌యంగ్ హీరో చిరంజీవి స‌ర్జా మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోతుంది ఆయ‌న భార్య మేఘ‌నా రాజ్. కాగా హీరో చిరంజీవి స‌ర్జా కొద్ది రోజుల క్రితం గుండె పోటుతో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి స‌ర్జా 2018 మే 2న మేఘ‌నా రాజ్ ను వివాహం చేసుకున్నారు. ‌‌ చిరంజీవి మ‌ర‌ణం పై తాజాగా సోష‌ల్ మీడియాలో భావోద్వేగ‌పు పోస్ట్ చేసింది మేఘ‌నా రాజ్. చిరు నీకు చాలా విష‌యాలు చెప్పాల‌ని ఉంది. నీతొ కొద్దిసేపు మాట్లాడ‌ల‌ని ఉంది. కానీ ఎంత ప్ర‌య‌త్నించినా దాన్ని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేక‌పోతున్నాను.

నువ్వు నాకు ఎంత ముఖ్య‌మ‌నేది ప్ర‌పంచంలో ఏదీ వ‌ర్ణించ‌లేదు. స్నేహితుడిగా, ప్రేమికుడిగా, జీవిత భాగ‌స్వామిగా, చంటి పిల్లాడిగా, నా ధైర్యంగా, నా భ‌ర్త‌గా.. అస‌లు వీట‌న్నింటి క‌న్నా ఎక్కువే. నువ్వు నా ప్రాణం. నువ్వు లేవ‌ని తెలిసిన ప్ర‌తిసారి నా మ‌న‌సు కుంగిపోతుంది. ఎప్ప‌టికీ నా చేయి వ‌ద‌ల‌నంటూ మాటిచ్చావు. కానీ ఏం చేశావు? మ‌న ప్రేమ‌కు గుర్తుగా నాకు పాపాయిని ఇస్తున్నందుకు నీకు చిర‌కాలం కృతజ్ఞ‌త‌లు తెలుపుతూనే ఉంటాను.

మ‌న‌ బిడ్డ‌గా నిన్ను మ‌ళ్లీ భూమిపైకి తీసుకువ‌చ్చేందుకు నేను త‌హ‌త‌హలాడుతున్నాను. నీతో క‌లిసి బ‌తికేందుకు ఎదురు చూస్తున్నాను. నా ఉపిరి ఆగిపోయే వ‌ర‌కు నువ్వు బ్ర‌తికే ఉంటావు..ఎందుకంటే నువ్వు నాలోనే ఉంటావు..ఐ ల‌వ్ యూ చిరు అని మేఘ‌నా పోస్ట్ చేసింది.

- Advertisement -