రామ్‌కిరణ్, మేఘాఆకాశ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం సఃకుటుంబనాం చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. హెచ్ఎన్‌జీ మూవీస్ సినిమాస్ పతాకంపై ఉదయ్‌శర్మ దర్శకత్వంలో హెచ్.మహాదేవ్ గౌడ, హెచ్.నాగరత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్‌లపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ కొరియోగాఫ్రర్ చిన్నిప్రకాష్ కెమెరా స్విచ్చాన్ చేయగా, ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం క్లాప్‌నిచ్చారు. చిత్ర నిర్మాత మహాదేవ గౌడ్ దర్శకుడికి స్క్రిప్ట్ అందజేయగా, ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు ఉదయ్‌శర్మ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ కథ వినగానే నిర్మతా ఓకే చేసిన సినిమా ఇది. చిత్రంలో తన పాత్ర గురించి వినగానే కొత్త హీరో అని చూడకుండా మేఘా ఆకాష్ వెంటనే ఒప్పుకున్నారు. క్లీన్‌ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్రం అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు. మేఘా ఆకాష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నా పాత్ర పేరు సిరి. నాకు బాగా నచ్చిన పాత్ర ఇది. ఈ సినిమాలో నటించడం ఆనందంగా వుంది అన్నారు. కథానాయకుడు రామ్‌కిరణ్ మాట్లాడుతూ ఈ చిత్రానికి కథే హీరో. ఈ కథను నమ్మి ఇంత మందికి అవకాశం ఇచ్చిన నిర్మాతకు థ్యాంక్స్. అన్ని ఎమోషన్స్ వున్న చాలా శక్తివంతమైన కథ ఇది.
Also Read:విటమిన్ బి3 లోపిస్తే.. ప్రమాదమా?
ఈ చక్కని కుటుంబ కథా చిత్రం అందరికి నచ్చుతుంది అన్నారు. ఈ కథ వినగానే నచ్చి ఈ సినిమా చేస్తున్నానని, న్యూ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుందని నిర్మాత తెలిపారు. హీరో అవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న రామ్‌కిరణ్ కెరీర్‌కు ఈ చిత్రం మంచి బిగినింగ్‌గా వుంటుందని, ఇప్పటి వరకు ఇలాంటి కథ రాలేదని ఎంతో అద్బుతమైన కథగా ఈ చిత్రం వుంటుందని చిన్నిప్రకాష్ మాస్టర్ తెలిపారు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, రాహుల్ రామకృష్ణ. రచ్చరవి, శుభలేఖ సుధాకర్, భద్రం, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.
Also Read:టీడీపీకి జగన్ పూర్తిగా చెక్ పెట్టినట్లేనా ?