రాయ్ లక్ష్మి హాట్ అందాలతో తెగ హల్చల్ చేస్తుంది. ఆ మద్య లారెన్స్ తో కాంచన చిత్రం, రవితేజతో బలుపు, పవన్ కళ్యాన్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాల్లో కనిపించింది రాయ్ లక్ష్మీ .అంతేనా ఈ అమ్మడు మెగాస్టార్‌తో కూడా ఆడిపాడింది. చిరంజీవి 150 సినిమాల్లో ఐటమ్ సాంగ్‌లో తన హాట్ అందాలతో కుర్రకారు మతులు పోగోట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన మూవీ జూలీ2. ఈ నెల 24 విడుదల కాబోతోంది. అయితే ఈ అమ్మడు బాలీవుడ్లో చేసిన మొదటి సినిమా జూలీ2 కావడం విశేషం.
ఈ సందర్భంగా రాయ్ లక్ష్మికి మెగాస్టార్ చిరంజీవి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ వీడియోను పంపారు చిరు. బాలీవుడ్ లో తొలి సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇది నీకు ప్రత్యేకమైన సినిమా అని ఎందుకంటే ఇది నీ కెరీర్ లో 50వ సినిమా అని చెప్పారు. వివిధ భాషల్లో నటిస్తూ, అభిమానులను మెప్పిస్తున్న నిన్ను చూసి చాలా సంతోషిస్తున్నానని అన్నారు. నీ టాలెంట్ ను, నీలో ఉన్న సత్తాను ‘జూలీ 2’ చూపిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. “వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్… గుడ్ లక్ టు ‘జూలీ 2′” అంటూ చివర్లో ఫ్లయింగ్ కిస్ విసిరారు.
ఈ వీడియోను చూసి రాయ్ లక్ష్మి సంతోషం పట్టలేక తబ్బుబై. “ఓ మై గాడ్. మీ నుంచి శుభాకాంక్షలు అందుకోవడం నిజంగా ఒక ఆశీర్వచనంలాంటిది. నా జీవితంలో ఇది ఒక గొప్ప బహుమతి. థ్యాంక్యూ సో మచ్ చిరంజీవి గారు. ఊహించని అనుభూతికి నేను లోనయ్యాను. లవ్ యూ సర్” అంటూ ట్వీట్ చేసింది. మరి మొదటి సారి బాలీవుడ్లో రిలీజ్ అవుతున్న ఈ అమ్మడి సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
Omg !!!😳 this is truly a blessing to get an heart felt wishes from u sir 😍the best gift of my life🙏😁thank u so Soo much #Chiranjeevi Garu I am extremely touched n humbled!u gave me more courage!u surprised #rathalu😋☺️Love u sir❤️😘 #julie2 24th NOV 😘😁 pic.twitter.com/8uLosLQCnD
— RAAI LAXMI (@iamlakshmirai) November 22, 2017