మహేష్‌ సెట్స్‌లో మెగాస్టార్..

219
Megastar visits Mahesh movie sets
- Advertisement -

టాలీవుడ్‌లో ట్రెండ్ మారింది. గతంలో ఎప్పుడు ఒక హీరో సినిమాకు మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం, ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం చూసిఉండేవాళ్లం కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్ధితి మారింది.  మొన్న ఖైదీ నెం 150 షూటింగ్ స్పాటుకు చాలామంది యంగ్ హీరోలు వచ్చినట్లు సందడి చేశారు. దీంతో టాలీవుడ్‌లో మంచి వాతావరణం ఏర్పడింది.

ఇక ఇదే ట్రెండ్‌ను ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కంటిన్యూ చేశారు. మహేశ్ – మురుగదాస్ కాంబినేషన్లోని సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఇదే స్టూడియోలో చిరంజీవి చేస్తోన్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. దాంతో షూటింగ్ గ్యాప్ లో చిరంజీవి మహేశ్ మూవీ సెట్స్ కి వచ్చి స్వీట్ షాకిచ్చారట.

మహేష్ షూట్ కు చిరు రావటంతో యూనిట్ అంతా ఆనందంలో మునిగితెలారట. ఈ విధంగా మహేష్ సినిమా సెట్టుకు మెగా అతిథి వచ్చారని.. ఆ సినిమా సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ అభిమానులతో పంచుకున్నారు.

మహేశ్ ఇంట్రో సాంగ్ కి సంబంధించిన షూటింగ్ ను చూసి టీమ్ ను అభినందించారని అంటున్నారు. మహేశ్ తోను .. మురుగదాస్ తోను కాసేపు మాట్లాడారని చెబుతున్నారు. గతంలో మురుగదాస్ తో చిరంజీవి ‘స్టాలిన్’ సినిమా చేశారు. రీసెంట్ గా చేసిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా కథ కూడా మురుగదాస్ దే. అందువలన తన కోసం ఒక కథను సిద్ధం చేయమని మురుగదాస్ కి చిరంజీవి చెప్పారనే టాక్ వినిపిస్తోంది.

- Advertisement -