సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ తాజాగా సూపర్ ఛాన్స్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో హీరోయిన్గా నటించనున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మాత ( గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్)గా చిరంజీవి 156వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలోనే చిరంజీవితో మృణాల్ రొమాన్స్ చేయనుంది. హను రాఘవపూడి అద్భుతంగా మలిచిన ప్రేమ కావ్యం సీతారామం సినిమాలో సీతగా మృణాల్ ఆడియన్స్ ను అద్భుతంగా మెప్పించింది. మరి మెగాస్టార్ సరసన మృణాల్ ఠాకూర్ ఏ రేంజ్ లో మెప్పిస్తోందో చూడాలి.
అన్నట్టు ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో అల్లరి నరేష్ నటించనుండటం ఆల్మోస్ట్ ఖాయమని తెలుస్తోంది. తను ఇప్పటికే ఒప్పుకున్న సినిమాను కొంచెం ఆపి మరీ మెగా సినిమా చేయనున్నాడట అల్లరి నరేష్. అలాగే ఈ మెగా 156వ సినిమాలో షామా సికిందర్ ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుంది. ఓ వైపు సినిమాలు మరోవైపు సీరియల్స్ తో కెరీర్ ను బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన షామా సికిందర్ నాలుగు పదుల వయసులో కూడా ఐటమ్ సాంగ్స్ లో అదరగొడుతుంది. లేటు వయసులో కూడా తన ఫిజిక్ తో ఆకట్టుకుంటుంది. కాబట్టి మెగా ఐటమ్ సాంగ్ లో కూడా బాగానే అలరించవచ్చు.
ఐతే, ఓ పక్క మెగాస్టార్ సినిమా కోసం మేకర్స్ ఇన్ని కసరత్తులు చేస్తుంటే.. ఐ బొమ్మ వెబ్సైట్ మాత్రం చిరంజీవికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఐ బొమ్మ వెబ్ సైట్ నోట్ లో ‘చిరంజీవి సినిమాలు మా వెబ్ సైట్లో జనాలు చూసేందుకు ఆసక్తి చూపించడం లేదని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ న్యూస్ కింద ముసలోడి సినిమాలు ఎవ్వడు చూస్తారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also Read:శ్రీను వైట్లతో గోపిచంద్ @ 32