మెగా ఫ్యాన్‌కు చిరు సాయం..

196
chiru
- Advertisement -

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి ఓ పేద అభిమాని కుమార్తె పెళ్లికి ఆర్థిక సాయం చేశారు. మహబూబాబాద్ పట్టణానికి కి చెందిన బోనగిరి శేఖర్ మిర్చి బండితో జీవనాన్ని సాగిస్తూ గత 30 సంవత్సరాల నుండి మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిగా ఉన్నారు. చిరంజీవి సేవా కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటున్నారు. శేఖర్కీ ఇద్దరు కూతుళ్ళు వర్ష.. నిఖిత. వీళ్ళ పేదరికాన్ని స్వయంగా చిరంజీవి తెలుసుకొని పెద్దమ్మాయి వర్ష పెళ్లికి 1లక్ష ఆర్ధిక సాయం అందచేశారు.

అభిమానులు కష్టాల్లో ఆదుకోవడం మెగా హీరోలకు కొత్తేమీ కాదు. మెగాస్టార్ పలు సందర్భాల్లో విరివిగా విరాళాలిచ్చారు. గతంలో కొందరు అభిమానులకు ఆస్పత్రి ఖర్చులకు సాయం చేశారు. ఇటీవల సీసీసీ సరుకుల పంపిణీ పేరుతో వేలాది సినీకార్మికులకు క్రైసిస్ కాలంలో ఆదుకునే ప్రయత్నం చేసారు.

- Advertisement -