ఆదివారం జరిగిన ‘ఓ పిట్టకథ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి యాంకర్ అనసూయ కూడా చీఫ్ గెస్టుగా వచ్చింది. ఈ వేడుకలో చిరు అనసూయపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగస్థలంలో నటించినపుడు చిరంజీవికి బాగా పరిచయమైంది అనసూయ. ఈ వేడుకలో మాట్లాడిన చిరు ఆమెను రంగమ్మ అని ఆప్యాయంగా పిలిచాడు.
ఈ సినిమాలో మీరు కూడా ఉన్నారా లేదంటే గెస్టుగా వచ్చారా అంటూ అనసూయను అడిగిన వెంటనే గుండె పట్టుకున్నాడు మెగాస్టార్. మొన్న టెస్ట్ చేయించుకున్నాను.. నా గుండె చాలా స్ట్రాంగ్‌గా ఉందని అన్నారు. కానీ, ఇప్పుడు ఎందుకో చాలా పెయిన్ వచ్చింది అర్థం కావట్లే.. అని అనసూయతో రొమంటిగ్ మాట్లాడారు చిరు. అన్ని మాట్లాడిన తర్వత.. రామ్ చరణ్‌కి చెప్పకమ్మా!’ అని చిరంజీవి అన్నారు. దాంతో అక్కడున్న వాళ్లంతా నవ్వేసారు. ఇక అనసూయ కూడా వెంటనే ఇది చాలు సర్ నాకు అంటూ చిరు వైపు చూస్తూ నవ్వేసింది.
అయితే ఇందుకు సంబంధించిన ట్విట్టర్లో ఓ ఫొటోను పోస్ట్ చేసిన అనసూయ హర్షం వ్యక్తం చేసింది. ‘హాహాహా… చాలా క్యూట్.. చాలా వినయం.. మెగా లెజెండ్‌ను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది’ అంటూ ఎప్పటికీ చిరు ఫ్యాన్ అని ట్వీట్ చేసింది. అమితానందం వ్యక్తం చేస్తున్నట్లు, సిగ్గుపడుతున్నట్లు స్మైలీలు పోస్ట్ చేసింది.
Hahaha 🙈🙈🥰 Such a cutie!!! Such humility !!! So much to learn from this Mega Legend!! #ChiruFanForever 😍🤩 https://t.co/GNVZXTdHw9
— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 2, 2020