మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహరెడ్డి సినిమా చేస్తున్నాడు. ఈచిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ విదేశాలలో జరుగుతుంది. 2019సమ్మర్ లో మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.
అయితే ఈసినిమా తర్వాత చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో సినిమా చేయనున్నాడని సమాచారం. ప్రస్తుతం కొరటాల స్ర్కీప్ట్ ను తీర్చిదిద్దే పనిలో ఉన్నాడని తెలుస్తుంది. సంక్రాంతి తర్వాత ఈసినిమా ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది.
ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఎవరిని ఎంచుకొనున్నారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసందర్భంగా హ్యుమా ఖురేషి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈమె రజనీకాంత్ నటించిన కాలా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీతో ఆమె తెలుగు తెరకు పరిచయం అయింది. తాజాగా చిరు కొరటాల మూవీ కోసం హ్యుమా ఖురేషిని ఎంపిక చేసినట్టు సమాచారం.