చిరుతో 152 మూవీ లేదు:అశ్వినీ దత్

226
- Advertisement -

ఖైదీ నెంబర్ 150తో వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యలవాడ నరసింహరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగాతెరకెక్కుతున్న సైరా సినిమాలో నటిస్తుండగా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా షూటింగ్ నడుస్తుండగానే చిరు వైజయంతి మూవీస్‌ బ్యానర్‌లో సినిమాకు కమిట్ అయ్యాడనే వార్తలు వెలువడ్డాయి.

ఈ రూమర్లపై క్లారిటీ ఇచ్చింది వైజయంతి మూవీస్. చిరంజీవితో సినిమా చేయ‌బోతున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌లో ఏ మాత్రం నిజం లేదు. మెగాస్టార్‌తో ఇప్ప‌టికే నాలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమాలు చేశాం. ఐదో ప్రాజెక్ట్ చేయాల్సి వ‌స్తే గ‌ర్వంగా ఆ ప్రాజెక్ట్ గురించి ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ దత్.

Megastar Chiranjeevi

అయితే సైరా సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు మెగాస్టార్. ఖైదీ నెంబర్ 150తో నిర్మాతగా మారిన రాంచరణ్..కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సైరా సినిమాను కూడా నిర్మిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌తో కలిసి చెర్రీ నిర్మించనున్నారు.

ఎన్టీఆర్,ఏఎన్నార్,కృష్ణ,శోభన్ బాబు,కృష్ణంరాజు వంటి అగ్రహీరోలతో సినిమాలు తీసింది వైజమంతి మూవీస్. ఇక చిరంజీవితో తీసిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఇండస్ట్రి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తర్వాత చిరుతో ఇంద్ర మూవీని తీసింది వైజయంతి మూవీస్. రామ్‌ చరణ్‌,ఎన్టీఆర్,మహేష్ బాబు,నారా రోహిత్,అల్లు అర్జున్‌ను వెండితెరకు పరిచయం చేసింది వైజయంతి మూవీసే. లెటెస్ట్‌గా సావిత్రి బయోపిక్ మహానటిని నిర్మించి ఆల్ టైమ్ ఇండస్ట్రి హిట్‌ కొట్టింది.

- Advertisement -