మేకప్ వేసుకుందే రాజమండ్రిలో: చిరు

87
chiranjeevi
- Advertisement -

రాజమండ్రితో తనకు అనుబంధం ఉందని…మేకప్ వేసుకుంది ఇక్కడేనని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాలలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చిరు….తనకు, అల్లు రామలింగయ్యకు గురు శిష్యుల అనుబంధం ఉందన్నారు. ఓసారి నేను కడుపునొప్పితో బాధపడుతుంటే ఆయన హోమియోపతి చికిత్సతో దాన్ని పూర్తిగా నయం చేశారని గుర్తుచేశారు. ఇప్పటికీ నాతో పాటు నా పిల్లలు, వాళ్ల పిల్లలు కూడా హోమియోపతిని ఫాలో అవుతున్నాం అన్నారు.

అల్లు రామలింగయ్య బహుముఖ ప్రఙ్ఞాశాలి…. నటుడిగా కొనసాగుతూనే ఆయన హోమియోపతిపై పట్టు సాధించారని చెప్పారు. నిత్య విద్యార్థిలానే ఎంతో కష్టపడ్డారని… ఎంతో మందికి సేవ చేశారన్నారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కోట శ్రీనివాసరావు, మురళీ మోహన్‌ వంటి ఎంతోమందికి చికిత్స అందించారన్నారు.

- Advertisement -