చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్న చిరు..

37
chiru

ఈరోజు అంతర్జాతీయ బ్రదర్స్ డే. ఈ సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో తన ఇద్దరు సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్ లతో తన చిన్నప్పటి ఫొటోను కూడా పంచుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు చిరు.

బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఆ ఫొటోలో పవన్ కల్యాణ్‌ను చిరంజీవి ఎత్తుకోగా, పక్కనే నాగబాబు చిరునవ్వులు చిందిస్తూ ఉండడాన్ని చూడొచ్చు. ఈ ఫొటోను పోస్టు చేసిన చిరు తోడబుట్టిన బ్రదర్స్ కి, రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ (ఫ్యాన్స్)కి హ్యాపీ బ్రదర్స్ డే అంటూ విషెస్ తెలిపారు. ఈ ఫొటో పోస్టు చేసిన కొద్దిసేపట్లోనే వైరల్‌గా మారింది. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు.