బిగ్గెస్ట్ పార్టీ కి మెగాస్టార్ రెడీ.. మరి మీరూ.. ?

143
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి – మాస్ మహారాజ్ రవితేజ కలయికలో వచ్చే సంక్రాంతికి రాబోతున్న ‘వాల్తేరు వీరయ్య’ నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. నవంబర్ 23 వ తేదీ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘బాస్ పార్టీ’ అనే సాంగ్ రిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్ని తాజాగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. పైగా బిగ్గెస్ట్ పార్టీ ఆఫ్ ది ఇయర్‌ కు రెడీగా ఉండండి అంటూ ఒక క్యాప్షన్ ను కూడా జోడించింది. మరి ఈ సాంగ్ నిజంగానే ఆ రేంజ్ లో ఉంటుందా ?, ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మెగాస్టార్ సినిమా అనగానే దేవికి సహజంగానే పూనకం వచ్చేస్తోంది. కాబట్టి.. ‘బాస్ పార్టీ’ సాంగ్ తో డిటిఎస్ బాక్స్ లు బద్దలు అవ్వడం ఖాయం.

ఇప్పటికే కీలక షెడ్యూల్స్ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న ‘వాల్తేరు వీరయ్య’, మరో కొత్త షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేస్తున్నారు. వచ్చే వారం నుంచి మూడు వారాల పాటు కొనసాగనున్న ఈ షూటింగ్‌ లో పలు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సీన్స్ తో ఈ చిత్రం పూర్తి టాకీ పార్ట్ పూర్తి కానుంది. అన్నట్టు ఈ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ లో చిరంజీవికి రవితేజ సవతి తల్లి కొడుకుగా కనిపిస్తున్నాడు. ఈ రెండు పాత్రల మధ్య గట్టి ఎమోషనల్ వార్ కొనసాగుతుంది.

చిరు – రవితేజ పాత్రల మధ్య వచ్చే ఆ నాటకీయ పరిణామాలే.. ఈ సినిమాలో డెప్త్ ను బాగా ఎలివేట్ చేస్తోందట. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో మెగాస్టార్ ను పోలీస్ పాత్రధారి అయిన రవితేజ అరెస్ట్ చేసే సీన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తోందట. మరి వాల్తేరు వీరయ్య సంక్రాంతికి ఏ స్థాయి విజయాన్ని సాధిస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -